Wednesday, 22 April 2026
అథ కేన ప్రయుక్తోఽయం
అర్జున ఉవాచ...
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః।
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః॥36॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు తపనకు కొంచెం ఊరట కలిగినట్లుంది.ఇంత సేపూ కృష్ణుడు ఒక్కడే ఏకపక్షంగా మాట్లాడుతున్నాడు.అర్జునుడు అయోమయం మొహం పెట్టుకుని తత్తర బిత్తరగా ఉన్నాడు.ఇప్పుడిప్పుడే కొంచెం చలనం కనిపిస్తుంది.
అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా!మానవుడు తనకు ఇష్టం లేకపోయినా,పరిస్థితుల ప్రభావానికి లోనై పాపాలు చేస్తూనే ఉన్నాడు కదా!ఆ తప్పు దారిలో నడిచే దానికి అతనిని ఏ కారణాలు ప్రేరేపిస్తున్నాయి?
శిష్యుడు గురువు చెప్పిన దానికంతా తల ఊపుతూ ఉంటే ఆ గురువుకు అర్థం కాదు....శిష్యుడికి ఎంత మాత్రం అర్థం అయింది అని.అస్సలు అర్థం అయిందా లేదా అని.శిష్యుడికి అనుమానాలు వచ్చి,ప్రశ్నిస్తే గురువుకు అవగతం అవుతుంది...శిష్యుడికి ఎంత మాత్రం అర్థం అయిందని.కృష్ణుడికి సంతోషంగా ఉంది అర్జునుడి ప్రశ్న వినగానే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment