Monday, 27 April 2026
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన మాత్మనా।
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్॥43॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
ఓం శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోఽధ్యాయః....
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!మహాబాహువులు కలవాడివి నీవు.అంతే కాకుండా నీవు నీ బుద్ధిని,మనస్సునీ కూడా సమన్వయ పరుచుకో!ముందర ఈ ఆత్మ అనేది అన్నిటికంటే గొప్పది అని అర్థం చేసుకో!మనం మాట్లాడుకునే మనసు,బుద్ధి,ఇంద్రియాలు,శరీరం కంటే చాలా గొప్పది.కాబట్టి మనం బుద్ధి చేతనే మనసును స్వాథీన పరుచుకోవాలి.కామమనేది అంత సులువుగా జయించలేము.కానీ బుద్ధి,మనసు మన చెప్పుచేతలలో ఉంటే ఇంద్రియాలను,తద్వారా కామాన్ని కూడా జయించగలతాము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment