Wednesday, 29 April 2026
ఇమం వివస్వతే యోగం
శ్రీభగవానువాచ...
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్।
వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవేత్॥1॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞానయోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాన యోగం గురించి చెప్పడం మొదలు పెట్టాడు.అర్జునా!నేను నిన్ను యుద్ధం కోసం ప్రేరేపించేదానికి కట్టు కథలు చెప్పడం లేదు.గారడీలు చేయటం లేదు.ఈ జ్ఞాన యోగమనేది చాలా సనాతనమయినది.ఇది వ్యయము కానిది.దీనిని పూర్వమెప్పుడో నేను వివస్వుడు,అనగా సూర్యభగవానుడికి బోధించాను.సూర్యుడు ఇప్పటివాడు కాదు కదా!సూర్యుడు ఒక నక్షత్రము.భూమి పుట్టిన తరువాత,మనుష్యులు పుట్టిన తరువాత,సూర్యుడు ఆ జ్ఞానాన్ని మనువుకు తెలియ చెప్పాడు.అలా సూర్య వంశ రాజు అయిన ఇక్ష్వాకుడికి మనువు చెప్పాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment