Thursday, 16 April 2026
మయి సర్వాణి కర్మాణి
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాఽధ్యాత్మ చేతసా।
నిరాశీ ర్నిర్మమోభూత్వా యుధ్యస్వ విగతజ్వరః॥30॥3॥శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యం బోథిస్తున్నాడు.అర్జునా!నా,నీ అనే మమకారం వదిలెయ్యాలని చెప్పాను కదా!అసలు ఏ పనీ నీ కోసం అనుకుని చేయకు.నీవు చేసే సమస్త కర్మలూ నా కోసం చెయ్యి.నాకే సమర్పించు.అది నాది,ఇది నీది.నా కది కావాలి.ఇది వద్దు.ఇలాంటి కోరికలు మానెయ్యి.అంతా నాదే,అంతా నాకే అనే అహంకారం,అహంభావము మానెయ్యి.ఏదో తప్పు చేస్తున్నాను.నాకేమీ మంచి జరగడం లేదు అనే దుఃఖాన్ని ప్రక్కన పెట్టు.మోహం నుంచి బయట పడు.వివేకవంతుడివి కా!యుద్ధం చెయ్యి.నీ కోసం చేయనక్కరలేదు.నా కోసం చెయ్యి.దాని ఫలితం..।మంచైనా,చెడు అయినా నాకే వదిలెయ్యి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment