Monday, 20 April 2026
ఇంద్రియ స్యేంద్రియ స్యార్థే
ఇంద్రియ స్యేంద్రియ స్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ।
తయోర్నవశ మాగచ్ఛే త్తౌహస్య పరిపంథినౌ॥34॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మనం ఎక్కడ,ఏ విషయాలలో అప్రమత్తంగా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!ఈ ఇంద్రియాలూ,వాటికి సంబంధించిన విషయాలూ ఉన్నాయి కదా!అవి ఊరకనే ఉండవు.వీటి మథ్య రాగద్వేషాలు అనే పుల్లలు పెత్తనం చెలాయిస్తుంటాయి.సన్నగా పొగ బెట్టి,మంట రాజేస్తుంటాయి.వాటికి చిక్కి లోబడిపోయామా!ఇంక ఇంతే సంగతులు!కాబట్టి,ససేమిరా,రాగద్వేషాలను దరిదాపుల్లోకి కూడా మనం రానీయకూడదు.అప్రమత్తంగా ఉండాలి.ఇదంతా ఆషామాషీ వ్యవహారం కాదు.నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే,ఇవే జ్ఞానానికి ప్రబల శత్రువులు.తస్మాత్ జాగ్రత్త!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment