Saturday, 25 April 2026

ఇంద్రియాణి మనోబుద్ధి

ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్ఠాన ముచ్యతే। ఏతైర్వి మోహ యత్యేష జ్ఞాన మావృత్య దేహినమ్॥40॥3॥శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము. శ్రీకృష్ణుడు అర్జునుడికి కామమనేది ఎంత చెడ్డదో వివరిస్తున్నాడు.అర్జునా!సఖా!ఈ కామమనేది ఉందే,అది అందరినీ దుంపతెంచి గంప కెత్తుతుంది.దానితో పని కాదు.దూరంగా ఉంటేనే ఒంటికి మంచిది.ముందరగా మనసును తొలుస్తుంది.చిన్నగా బుద్ధిని వక్రంగా మారుస్తుంది.అంతటితో ఆగుతుందా?అంటే,ఊహూ!ఇంద్రియాలను చేరి నిగ్రహం కోల్పోయేలా చేస్తుంది.మనిషి అన్న తరువాత అంతో ఇంతో వివేకం ఉంటుంది కదా!దానిపైన ఒంటి కాలు పైన లేచి యుద్ధం ప్రకటిస్తుంది.చివరకు గెలిచేది అదే అనుకో!మనం క్షతగాత్రులం అవుతాము.ఇంద్రధనుస్సులాంటి సప్త వర్ణ సుందర లోకం చూపించి ఊరిస్తుంది.ఇంకేం ఉంది?దేహధారులు అయిన మానవులు బొక్క బోర్లా పడిపోతారు.తరువాత గానీ అసలు వ్యవహారం తెలియదు.

No comments:

Post a Comment