సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత।
కుర్యా ద్విద్వాం స్తథా సక్త శ్చికీర్షు ర్లోకసంగ్రహమ్॥25॥3॥
శ్రీమద్భగవద్గీత...।కర్మ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు...ఏ రకంగా ఆలోచించినా కర్మలు చేయడం తప్పదు,తప్పించుకోలేము అని.హే అర్జునా!ఏ భరతశ్రేష్టా!కర్మలను చేయడం ఎవరికీ తప్పదు.ఏ రకంగా ఆలోచించినా చేయాల్సిందే!
అజ్ఞానులు ఫలాపేక్ష కోసం కర్మలను చేస్తారు.జ్ఞానులు స్వలాభంకోసం చేయరు.ఆసక్తిరహితంగా చేస్తారు అంటే ఎలాంటి కోరికలు,ఇచ్ఛ లేకుండా చేస్తారు.కానీ లోకసంగ్రహణం కోసరము చేయవలసిన పనులు అన్నీ చేస్తూ ఉంటారు.
No comments:
Post a Comment