ఇంద్రియాణి పరాణ్యాహు రింద్రియేభ్యః పరం మనః।
మనసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సః॥42॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ ప్రాముఖ్యం చెబుతున్నాడు.అర్జునా!ఈ శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి.ఇంద్రియాల కంటే మనసు గొప్పది.మనసు కంటే బుద్ధి గొప్పది.బుద్ధి కంటే ఆత్మ గొప్పది.మనసు కంటే బుద్ధి గొప్పది అని ఎందుకు అంటున్నానంటే ఇంగితం ఆలోచింపచేస్తుంది బుద్ధి.ఆత్మ జ్ఞానం కోసరమే కదా మన తపన.ఆత్మ జ్ఞానం కలిగితే మోక్షం మన గుప్పిట్లో ఉన్నట్లే కదా!కాబట్టి ఆత్మ,ఆత్మ తత్వం అన్నిటికంటే ఉచ్ఛమయిన స్థానంలో ఉన్నాయి.
No comments:
Post a Comment