Saturday, 25 April 2026

ఆవృతం జ్ఞాన మేతేన

ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా। కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ॥39॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అజ్ఞానమనేది ఎంత పెద్ద తలకాయ నొప్పో చెబుతున్నాడు.హే అర్జునా!హే కౌంతేయా!జ్ఞానానికి శత్రువు ఏందో చెప్పు?సరే,నేనే చెబుతాను.అజ్ఞానమనేదే జ్ఞానానికి అతి పెద్ద శత్రువు.అగ్ని చాలా శక్తివంతమయినది అనుకుంటాము కదా!అన్నిటినీ,తన దారికి ఎదురొచ్చిన ప్రతి చిన్నదాన్ని,పెద్దదాన్ని కూడా నిర్దాక్ష్యంగా కాల్చి,భస్మంచేసి పోతుంది అని అనుకుంటాము కదా!అటువంటి అగ్ని కూడా ఇక్కడ నావల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేస్తుంది.ఎందుకంటావా?కామం అనే రూపంతో అజ్ఞానం జ్ఞానాన్ని కప్పిపెట్టేస్తుంది.ఈ కామమనేది మనం కాలి మసైపోయినా మంట కలిసిపోదు.అంత జడమయినది కామము,అతుక్కుంటే వదలించుకోలేము అస్సలు.కామము అంటే ఏంది చెప్పు?పొగలు,సెగలే కదా!ఆ పొగలోనే,ఆ సెగలోనే జ్ఞానం అంతా కృష్ణార్పణం అవుతుంది.

No comments:

Post a Comment