Sunday, 19 April 2026
సదృశం చేష్టతే స్వస్యాః
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్జ్ఞానవానపి।
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి॥33॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అర్థం కావాలంటే అతని చేతనే జవాబులు చెప్పించాలి అనుకున్నాడు.అందుకని ఇలా మొదలు పెట్టాడు.అర్జునా!నీకు తెలుసు కదా!ప్రతి ఒక్కరూ ప్రకృతి రీత్యానే ప్రవర్తిస్తారు అని.ఎంతటి మహాజ్ఞానులు అయినా దానికి అతీతులు కారు. వాళ్ళు ఎక్కడ నుంచో పుట్టుకు రాలేదు కదా!కాబట్టి మహాజ్ఞాని అయినా అందరి లాగే ప్రవర్తిస్తాడు కానీ వేరే రకంగా కాదు కదా!అలాంటప్పుడు బలవంతంగా నిగ్రహం వలన ఏమి ఒరుగుతుంది,చెప్పు?ఏదైనా అర్థం చేసుకుని,మనస్పూర్తిగా చేస్తేనే ఒంట పడుతుంది,ఫలితం ఇస్తుంది.నువ్వేమంటావు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment