Tuesday, 4 November 2025

ఏకాధ్యాయంతు యోనిత్యం

ఏకాధ్యాయంతు యోనిత్యం పఠతే భక్తి సంయుతః। రుద్రలోక మవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరమ్॥13॥ భగవంతుడి అభిప్రాయము ఏందంటే మనము ఒక పని చేసేటప్పుడు ఉండాల్సిన నియమనిష్ఠలు,భక్తిభావము,సత్సంకల్పము సరిగ్గా,సజావుగా ఉండాలి అని. అందుకే చెబుతున్నాడు.ఓ భూదేవీ!రోజుకు ఒక అధ్యాయము అయినా మనస్పూర్తిగా,ధ్యాసగా పఠించినా ఫలితము దక్కుతుంది.రోజూ ఒక్క అధ్యమైనా పఠించి,పారాయణ చేసేవాళ్ళు రుద్రలోకాన్ని పొందుతారు.ప్రమద గణాలతో చేరి,స్థిర నివాసము ఏర్పరుచుకుంటారు.

No comments:

Post a Comment