Friday, 7 November 2025

చంద్రలోక మవాప్నోతి

చంద్రలోక మవాప్నోతి వర్షాణా మయుతం ధృవమ్। గీతాపాఠ సమాయుక్తో మృతోమానుషతాం వ్రజేత్॥16॥ భగవంతుడు భూదేవితో అంటున్నాడు.భూదేవీ!నీకు ఇంకా ఈ విషయం తెలుసా!అసలు నేను ఈ భగవద్గీత వల్లనే స్థిరుడుగా ఉన్నాను.భగవద్గీతలోనే,దాని సారంలోనే నేను నివసిస్తున్నాను.దీని మూలంగానే,దాని ఆధారంగానే,దీని పద్థతి ప్రకారంగానే నేను ముల్లోకాలనూ పాలిస్తున్నాను. కాబట్టి గీతాధ్యయనం చేస్తూ మరణించినవారు మరలా ఉత్తమమయిన మానవ జన్మనే పొందుతారు.ముందర చెప్పినట్లు గీతలో కొసరంత రోజూ చదువుకుంటున్నా చంద్రలోకంలో పదివేల సంవత్సరాలు ఉంటారు.

No comments:

Post a Comment