Saturday, 29 November 2025
అస్మాకం తు విశిష్టాయే
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే॥7॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము...
దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని ఉద్దేశించి అంటున్నాడు.
హే గురువర్యా!మీరు బ్రాహ్మణోత్తములు!ఇంత సేపూ నేను మీకు పాండవ సైన్యంలోని వీరుల గురించి చెప్పాను కదా!ఇప్పుడు ఇంక మన సైన్యంలోని మహావీరుల గురించి చెబుతాను వినండి.
ఇక్కడే అర్థం అయిపోయింది కదా,మనకు.పాండవ సైన్యంలోని గొప్ప గొప్ప యోథుల గురించి ముక్తాయింపుగా,పొడి పొడి మాటలతో ముగించేసాడు.అదే తన వాళ్ళు,తన తరఫు వాళ్ళ గురించి చెప్పడంలో ఊపూ ఉత్సాహం తొంగి చూస్తున్నది.మహావీరుల గురించి చెబుతాను అని గర్వం తొణికిసలాడే గొంతుతో చెబుతున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment