Sunday, 30 November 2025

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః। అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ॥8॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... దుర్యోధనుడికి తమ తట్టు ఎంత మంది వీరులు ఉన్నారో చెప్పేదానికి ఛాతి ఇంకాస్త పెద్దదయింది.ఒకళ్ళా?ఇద్దరా?ఒకళ్ళను మించిన వాళ్ళు ఇంకొకళ్ళు.మీసాలు మెలివేసి,తన భుజాలు తనే తట్టుకునే విషయం! ఇలా చెబుతున్నాడు.ఓ బ్రాహ్మణోత్తమా!ద్రోణాచార్యా!మన తట్టు ఉండే హేమా హేమీల గురించి చెబుతాను,వినండి.అందరి కంటే మొదటి స్థానంలో మీరు ఉన్నారు.ఇంకా భీష్మ పితామహుడు,కర్ణుడు,కృపాచార్యుడు,అశ్వత్థామ,వికర్ణుడు,సౌమదత్తి మరియు జయద్రథుడు ఉన్నారు.వీళ్ళేకాదు ఇంకా చాలా మంది లెక్కకు మిక్కిలి ఉన్నారు.

No comments:

Post a Comment