Wednesday, 19 November 2025

దృష్ట్వా తు పాండవానీకం

సంజయ ఉవాచ.... దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా। ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్॥2॥1॥ సంజయుడు ధృతరాష్ట్రుడి ఆదుర్దా అర్థం చేసుకునినాడు.ప్రశాంతంగా చెబుతున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!ఇరు వైపులా రెండు సేనలు తమ తమ బలాలూ,బలగాలతో సంసిద్ధంగా ఉన్నాయి.ఇంకొంచెం సేపట్లో యుద్ధం మొదలవుతుంది అనగానే నీ కొడుకు అయిన దుర్యోధనుడు ఒకసారి పాండవుల సైన్య వ్యూహాన్ని చూసాడు.తమ ఆచార్యులు అయిన ద్రోణుడిని సమీపించి ఇలా అన్నాడు.

1 comment: