Thursday, 11 December 2025

ద్రుపదో ద్రౌపదేయాశ్చ

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే। సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్॥18॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ద్రుపదుడు,ద్రౌపది కొడుకులు అయిన అయిదుగురు ఉపపాండవులు,మిగిలిన చాలా మంది రాజులు ఉన్నారు యుద్ధ భూమిలో.యోధాగ్రేసరుడు అయిన సుభద్ర కొడుకు అభిమన్యుడు, పైన చెప్పిన రాజులు,వీరులు అందరూ తమ తమ శంఖాలను మళ్ళీ మళ్ళీ చాల సార్లు పూరించారు.యుద్ధం ఏ క్షణం అయినా మొదలు కావచ్చు.కాబట్టీ యుద్ధ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమను తమను తాము ఉత్తేజ పరుచుకుంటూ,తమ వారిని అందరినీ ఊపూ,ఉత్సాహంతో ముందుకు ఉరికేలా ప్రేరేపించుకుంటూ ఉన్నారు.

No comments:

Post a Comment