Friday, 5 December 2025

తతః శ్శంఖాశ్చ భేరశ్చ

తతః శ్శంఖాశ్చ భేరశ్చ పణవానక గోముఖాః। సహసై వా భ్యహన్యంత స శబ్ద స్తుములోఽభవత్॥13॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... భీష్ముడు దుర్యోధనుడిని సంతోష పెట్టేదానికే కాదు,తమ సైన్యాన్ని ఉత్తేజ పరిచేదానికి కూడా సింహనాదం చేసి,తన శంఖాన్ని పూరించాడు. ఎప్పుడూ ఒక సమూహంలో నాయకుడు ఏ భావాన్ని ప్రకటిస్తాడో,అతనిని అనుసరించేవాళ్ళు అందరూ అదే భావప్రకటనలోకి వెళ్ళిపోతారు.ఎవరికివారు ఆలోచించుకోరు,ఆలోచించలేరు,ఆలోచించనివ్వరు,అంత సమయం,సందర్భం,స్వేచ్ఛ కూడా ఇవ్వరు,ఉండదు.అందుకనే గొర్రెదాటు అంటారు.మన ముందు వాళ్ళు చేస్తున్నారని మనము స్పందిస్తాము.మనలని చూసి మన చుట్టు పక్కల వాళ్ళు ఇంకో పది మంది మనలాగే చేస్తారు,ప్రభావితులు అవుతారు.ఇలాగే గొలుసు ప్రభావంలాగా సాగిపోతుంది. ఇక్కడ కూడా అది వినిన కౌరవ వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు.భేరీ,పణవానక,గోముఖాదులను మ్రోగించారు.ఆ శబ్దం,ఆ హోరుతో నాలుగు దిక్కులూ నిండిపోయాయి.ఇలా ఒకరినొకరుగా అందరూ ఉత్తేజం నింపుకున్నారు.

No comments:

Post a Comment