Friday, 19 December 2025

గాండీవం స్రంసతే హస్తాత్

గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే। న చ శక్నో మ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః॥30॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడికి దిక్కుతోచడం లేదు.శ్రీకృష్ణుడితో తన ఘోష వెళ్ళగ్రక్కుతున్నాడు.బావా!ఏమీ అర్థం కావటం లేదు.మనసంతా అతలాకుతలమైపోతుంది.దానికి పర్యవసానంగా చేతిలోంచి గాండీవం జారిపోతుంది.పొయ్యి పైన పెనం కాగినట్లు ఒళ్ళంతా సెగలు,పొగలు!సల సల కాగిపోతుంది శరీరం!పిక్కలు జావగారి పోతున్నాయి.రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేక పోతున్నాడు.మనసు పరి పరి విథాల పోతుంది.

No comments:

Post a Comment