Thursday, 18 December 2025

సీదంతి మమ గాత్రాణి

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి। వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే॥29॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడు గద్గద స్వరంతో శ్రీకృష్ణుడితో అంటున్నాడు.కృష్ణా!నా అవయవాలన్నీ బండబారిపోతున్నాయి.చలనంలేక శిథిలాలు లాగా ఉన్నాయి.నోరు ఉన్నట్టుండి పిడచ కట్టుకుని పోతుంది.శరీరం నా ప్రమేయంలేకుండా కంపిస్తుంది.ఒళ్ళు గగుర్పాటుకులోనవుతుంది.నాకు అంతా అయోమయంగా ఉంది.బుర్ర అస్సలు పని చేయడం లేదు.ఈ వణుకుడు,ఈ రోమాలు నిక్కబొడుచుకోవడం...ఇవంతా నాకేమీ అర్థం కావడం లేదు.

No comments:

Post a Comment