Thursday, 25 December 2025
యేషామర్థే కాంక్షితం
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ॥33॥1॥
ఆచార్యాః పితరః పుత్రా స్తథైవ చ పితామహాః।
మాతులా శ్శ్వశురాః పౌత్రాస్స్యాలా స్సంబంధి న స్తథా॥34॥1॥
శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము....
మాములుగా మనం ఏమనుకుంటే అదే నిజం,సత్యం అని అనుకుంటాము.రెండు రెళ్ళ నాలుగు అని మన అందరికీ తెలుసు.కానీ ఒక సారి రెండు రెళ్ళ మూడు అనిపించింది అనుకో!అదే నమ్ముతాము.అదే నిజమని ప్రక్క వాళ్ళకి అందరికీ నమ్మేలా చెబుతాము.ఎవరైనా మనం తప్పు అంటే ససేమిరా ఒప్పుకోము.ఎప్పుడో కానీ మనం తప్పు అని మనకు తట్టదు.ఇంత చిన్న విషయం ఎందుకు బుర్రకు అర్థం కాలేదు అని మనలను మనమే ఆక్షేపించుకుంటాము.
అచ్ఛం అలానే జరుగుతుంది ఇక్కడ అర్జునుడికి కూడా!తను ఒక అవస్థలోకి వెళ్ళిపోయాడు.దానినే సమర్థించుకుంటున్నాడు.
కృష్ణా!నీకు తెలుసు కదా నేను యుద్థానికి సన్నద్ధమయింది మా వాళ్ళ కోసమే అని.కానీ ఇక్కడ చూడు.శత్రు పక్షంలో ఉండేది అంతా నా వాళ్ళే!నేను అసలు ఈ రాజ్యం,ఈ భోగాలు,ఈ సుఖాలు కోరుకుంది మా వాళ్ళ కోసమే కదా!ఆ విషయం నీకు కూడా తెలుసు కదా!
మరి ఇక్కడ చూడు.నేను ఎవరికోసం పోరాడాలనుకున్నానో...ఆ గురువులు,తండ్రులు,కుమారులు,తాతలు,మేనమామలు,బావలు,ఇంకా మిత్రులు,సహోదరులు..అందరూ నాతో యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్నారు.ప్రాణాలకు తెగించి మరీ పోరాడేదానికి నడుము బిగించి ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment