Wednesday, 24 December 2025

న కాంక్షే విజయం కృష్ణ

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ। కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితే న వా॥32॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడికి ఊపూ ఉత్సాహము అంతా అథఃపాతాళానికి పడిపోయాయి.మనసంతా నిర్వేదం ఆవరించింది.తన కష్టం సుఖం చెప్పుకునేదానికి,తన మనసులో తిరుగుతున్న సుడిగుండాల గురించి చెప్పేదానికి,చెప్పుకునేదానికి అతనికి కృష్ణుడి కంటే ఆత్మీయుడు,అయినవాడు,తనను సరిగ్గా అర్థం చేసుకోగలిగినవాడు ఇంకెవరూ లేరనిపించింది.అందుకే శ్రీకృష్ణుడితో నిరాసక్తంగా ఇలా అంటున్నాడు. కృష్ణా!సఖా!నాకు ఈ క్షణం ఏమీ వద్దు అనిపిస్తుంది.నాకు ఎవరిపైనా విజయం సాథించాలనే తలంపు లేదు.నాకు రాజ్యం కోరాలని లేదు.సుఖసంతోషాలలో మునిగి తేలాలని లేదు.యుద్ధం అంటే ఏంది?ఎదుట నున్న ప్రతి ఒక్కరినీ చంపుకుంటూ పోవటమే కదా!ఆ తట్టు అంతా నా వాళ్ళే ఉన్నారు.మరి నా బంథువులనంతా చంపేసుకుని నేను ఏమి బావుకుంటాను?నా అనే వాళ్ళు ఎవరూ లేని ఈ రాజ్యం నా కెందుకు?ఈ భోగభాగ్యాలు ఇంకెందుకు?అసలు ఈ జీవితమే వ్యర్థం కదా?కృష్ణా!నా కంతా అగమ్యగోచరంగా ఉంది.దిక్కుతోచడం లేదు.దిక్కులేని వాడికి దేవుడే దిక్కు కదా!నా దిక్కు నువ్వే!నాకు దిశా నిర్దేశం నీవే చేయాలి.

No comments:

Post a Comment