Tuesday, 16 December 2025

భీష్మ ద్రోణ ప్రముఖతః

భీష్మ ద్రోణ ప్రముఖత స్సర్వేషాం చ మహీక్షితామ్। ఉవాచ పార్థ పశైతాన్ సమవేతాన్ కురూనితి॥25॥1॥ శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము... సంజయుడు ధృతరాష్ట్రుడికి కృష్ణార్జునుల వ్యవహారం వివరిస్తున్నాడు.రాజా!శ్రీకృష్ణుడు అర్జునుడి కోరిక మేర రథాన్ని రెండు సేనల మధ్యకు తీసుకుని వచ్చి నిలబెట్టాడు.అదీ ఎలా అంటే భీష్మ పితామహుడు,ద్రోణుడు మొదలైన మహావీరులు,యోథులకు అభిముఖంగా!శ్రీకృష్ణుడు తన సహచరుడు అయిన అర్జునుడిని ఉద్దేశించి అంటున్నాడు. అర్జునా!నీవు చెప్పినచ్లే నేను మన రథాన్ని రెండు సేనల మధ్య నిలిపాను.నీవు కౌరవ వీరులు ఎవరెవరు ఉన్నారో చూడాలి,గమనించాలి,వాళ్ళ బలాబలాలు బేరీజు వేయాలి అన్నావు కదా!కౌరవ కూటమిలో ఉండే అందరినీ పరికించి,పరిశీలించు,ఒక లెక్క వేసుకో ఎవరెవరి సత్తా ఎంతో అని.

No comments:

Post a Comment