Monday, 15 December 2025

ఏవ ముక్తో హృషీకేశో

సంజయ ఉవాచ.... ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత। సేనయో రుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్॥24॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము.... సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధభూమిలో జరిగేది కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నాడు.ఓ రాజా!అర్జునుడు శ్రీ కృష్ణుడిని చిన్న కోరిక అడిగాడు.ఎంతైనా బావమరిది కదా!చెల్లెలును ఇచ్చి చేశా!తప్పుతుందా!చిన్ని చిన్ని కోర్కెలు కూడా తీర్చక పోతే ఎలా? శ్రీకృష్ణుడు అర్జునుడు అడగగానే సరే బావా అంటూ గుర్రాలను ముందుకు పోనిచ్చాడు.వాళ్ళ రథాన్ని రెండు సేనల మథ్యకు తీసుకుని వచ్చి,నిలబెట్టాడు.

No comments:

Post a Comment