Wednesday, 17 December 2025

కృపయా పరయాఽవిష్టో

కృపయా పరయాఽవిష్టో విషీద న్నిద మబ్రవీత్। అర్జున ఉవాచ.... దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్॥28॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడి మనసు అంతా దిగులు అయిపోయింది.అటు చూసినా,ఇటు చూసినా...ఇంకెటు చూసినా అంతా తన వాళ్ళే కనిపిస్తున్నారు.తనపైన తనకే జాలి వేస్తుంది.కదిలిస్తే కళ్ళనీళ్ళు వచ్చేలా ఉన్నాయి ఏ క్షణమైనా! గద్గదమైన గొంతుతో శ్రీకృష్ణుడిని ఉద్దేశించి అంటున్నాడు.కృష్ణా!మాథవా!మథుసూదనా!నీవు కూడా చూస్తున్నావు కదా!యుద్థభూమికి సన్నద్ధమై వచ్చినవాళ్ళందరూ మనవాళ్ళే!మన బంథుజనమే!

No comments:

Post a Comment