Tuesday, 2 December 2025

అయనేషు చ సర్వేషు

అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః। భీష్మ మేవాభి రక్షంతు భవంత స్సర్వ ఏవ హి॥11॥1॥ శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము... దుర్యోధనుడు ముక్తాయింపుగా తమ వైపు వారు అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు.ఇప్పుడు అందరికీ విషయం అర్థం అయింది కదా!మనవైపు వీరులు ఎక్కువ మంది ఉన్నారు.మనవైపు ఎక్కువ అక్షోహిణుల సైన్యం ఉంది.కాబట్టి మనకే గెలుపు అవకాశాలు ఎక్కువ.అలా అని ప్రత్యర్థి బలాలు మనము తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి మన పక్షాన ఉన్న మీరందరూ కూడా మీ మీ నిర్ణీత స్థానాలలో అప్రమత్తంగా ఉండండి.అసలు మీకు కేటాయించబడిన ప్రదేశాలను విడవకుండా జాగరూకతతో ఉండండి.మనకందరికీ నాయకుడు వృద్ధ పితామహుడు భీష్ముడు.అతనికి అన్ని వైపుల నుంచి రక్షణ కవచంలా ఉండి కాపాడటం మీ ధర్మం!

No comments:

Post a Comment