Monday, 8 December 2025

అనంత విజయం రాజా

అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠరః। నకులః సహదేవశ్చ సుఘోష మణి పుష్పకౌ॥16॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము.. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.అతను పక్షపాతం లేకుండా ఇరు సైన్యాల గురించి,అక్కడ జరిగే కథా,కమామిషు గురించి సవివరంగా తెలియ చేసేదానికే కదా నియమించబడింది. పాండవుల పక్షాన రాజు,కుంతీ పుత్రుడు అయిన యుధిష్ఠరుడు దివ్యమయిన తన అనంత విజయము అనే శంఖాన్ని పూరించాడు.వెను వెంటనే నకులుడు సుఘోషము అనే శంఖాన్ని,సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించారు మంగళప్రదంగా,

No comments:

Post a Comment