Thursday, 25 December 2025

ఏతా న్న హన్తు మిచ్ఛామి

ఏతా న్న హంతు మిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన। అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కింను మహీకృతే॥35॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము అర్జునుడు తన ధోరణిలో ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు.కృష్ణా!నేనొకటి చెప్పేదా నీకు.వాళ్ళు నన్ను చంపితే చంపనీ!నాకేమీ పరవాలేదు.నాకు మటుకు వాళ్ళను ఎవ్వరినీ చంపేదానికి మనసు రావటం లేదు.ఇష్టం పుట్టడం లేదు. కృష్ణా!నాకు ముల్లోకాథిపత్యం ఇస్తానని ఎవరైనా మభ్య పెట్టినా నాకు అక్కర లేదు.అలాంటిది తుచ్చమయిన ఈ మట్టీ,ఈ నేల కోసం మా వాళ్ళ ప్రాణాలు తీస్తానా!ఛ!ఛ!నాకు ఈ పాపం అస్సలు వద్దు.

No comments:

Post a Comment