Saturday, 13 December 2025

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః। ప్రవృత్తే శస్త్ర సంపాతే ధను రుద్యమ్య పాండవః॥29॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ఓ రాజా!పాండవులు పూరించిన శంఖనాదాలు భూమి ఆకాశాలు ప్రకంపించేలా చేసాయి.అప్పుడు అర్జునుడు కౌరవులను చూసాడు.అర్జునుడి ధ్వజము పైన హనుమంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు.హనుమంతుడు అపారమయిన శక్తికి ,ధైర్యానికి,భయ విచ్ఛేదనకు ప్రతీక కదా!అర్జునుడు తన శస్త్రాలనూ,ధనుస్సునూ ధరించాడు.శ్రీకృష్ణుని తట్టు మళ్ళి ఇలా అన్నాడు.

No comments:

Post a Comment