Wednesday, 17 December 2025

తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితృూనథ పితామహాన్। ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా॥26॥1॥ శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయోరపి। తాన్ సమీక్షస కౌంతేయ స్సర్వాన్ బంధూ నవస్థితాన్॥27॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... సంజయుడు ధృతరాష్రుడికి అర్జునుడి మానసిక పరిస్థితి వివరిస్తున్నాడు.రాజా!అర్జునుడికి తెలియక కాదు.కానీ అర్జునుడు ఖంగుతినినట్లు కనిపించాడు.దానికి కారణం చెపుతాను,విను. అర్జునుడు రెండు సేనల మధ్యకు తన రథాన్ని నిలపమని శ్రీకృష్ణుడిని కోరాడు.శ్రీకృష్ణుడు అలాగే చేసాడు కూడా.అర్జునుడు తల తిప్పి చుట్టూరా చూసాడు.రెండు సేనలలోనూ ఉన్నది వీరులు,శూరులే!కానీ వాళ్ళంతా తన తండ్రులు,తాతలు,గురువులు,మేనమామలు,సోదరులు,కుమారులు,మనుమలు,స్నేహితులు,హితులు,బావలు,బావమరుదులు...।ఇలా అందరూ తన వాళ్ళే. అర్జునుడికి ఒక్కసారిగా తల తిరిగి పోయింది.శత్రు పక్షం,తన పక్షంలోనూ అందరూ తనవాళ్ళే,తనకు కావలసిన వాళ్ళే!ఇలాంటి దుస్థితి పగవాడికి కూడా రాకూడదు. శత్రువులతో ఎంతైనా పోరాడవచ్చు.మనవాళ్ళే శత్రువులు అయితే..।।ఆ బాథ వర్ణనాతీతం!

No comments:

Post a Comment