Monday, 29 December 2025

తస్మా న్నార్హా వయం హంతుం

తస్మా న్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్। స్వజనం హి కథం హత్వా సుఖిన స్స్యామ మాథవ॥37॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడు శ్రీకృష్ణుడిని తన ఆలోచనా ధోరణిలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.కృష్ణా!శత్రుకూటమిలో ఉండే మా వాళ్ళందరూ అసలు వథించడానికి కూడా అర్హత సంపాదించుకోలేని వారు అని చెప్పాను కదా!అలాంటివారినందరినీ చంపుకుంటే పుణ్యమా?పురుషార్థమా?సుఖమా?సౌఖ్యమా?ఏమీ లేదు!కాబట్టి వదిలేసేద్దాం బావా!

No comments:

Post a Comment