Wednesday, 3 December 2025

తస్య సంజనయన్ హర్షం

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః। సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్॥12॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము పొగడ్తలకు లొంగని వాళ్ళు,పొంగని వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ ఉండరు.దానికి ఎవరం అతీతులం కాదు. దుర్యోధనుడు భీష్ముడు మన నాయకుడు,అందరం కలసి ఆయనను రక్షించుకోవాలి అనగానే మనసు హాయిగా అయింది.ఎప్పుడైనా ఇచ్చుకోమ్మా వాయనం అంటే పుచ్చుకోమ్మా వాయనం అంటారు కదా! అట్లాగే దుర్యోధనుడు తనను సంతోషపెట్టాడు కాబట్టి తను కూడా దుర్యోధనుడికి సంతోషం కలుగచేయాలనుకున్నాడు.అందుకని సింహనాదం చేసాడు.నలు దిక్కులు పిక్కటిల్లేలాగా భీష్ముడు తన శంఖాన్ని పూరించాడు.

No comments:

Post a Comment