Tuesday, 23 December 2025

నిమిత్తాని చ పశ్యామి

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ। న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజన మాహవే॥31॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము.. మనము మనోధైర్యం కోల్పోతే లేని పోని అనుమానాలు వస్తాయి.భయం..భయం..భయం!నిస్సత్తువ నేనున్నానంటూ మన ఒళ్ళోనే కూర్చుంటుంది.నిరాసక్తత మన తల చుట్టూ ముళ్ళ కిరీటం లాగా నిలబడిపోతుంది.కాళ్ళూ చేతులు ఆడవు.ఎదురుగా ఉండేవి సజావుగా కనిపించవు.లేనివి ఖచ్చితంగా ఉన్నట్లు భ్రమలు కలుగుతుంటాయి.కాబట్టి ఎప్పుడూ అధైర్యపడకూడదు. ఇక్కడ అర్జునుడు పైన చెప్పిన దీనావస్థలోనే ఉన్నాడు.శ్రీకృష్ణుడితో అంటున్నాడు.కేశవా!నారాయణా!హరీ!ఏతట్టు చూసినా నాకు దుశ్శకునాలే కనిపిస్తున్నాయి.దివిటీ పెట్టి వెతికినా ఒక్కటంటే ఒక్క మంచి శకునం కనిపించడం లేదు.ఇప్పుడు నేను ఈ యుద్ధంలో నా వాళ్ళని చంపుకోవాలి.అంతే కదా!నా వాళ్ళే లేనప్పుడు నేను ఎందుకు?ఒంటి కట్టు రామలింగం లాగా ఏమి సాథించాలి?ఏమి అనుభవించాలి?ఇదంతా అనవసరం కదా!ఎవరికీ ఏ మంచీ ఒరగదు కదా!అంతా నిష్ప్రయోజనం కదా!మన శక్తి యుక్తులు అన్నీ నిరుపయోగం కదా!కథ సుఖాంతం కాకపోతే!

No comments:

Post a Comment