Sunday, 14 December 2025
హృషీకేశం తదా వాక్యం
హృషీకేశం తదా వాక్యం ఇదమహ మహీపతే।
అర్జున ఉవాచ....
సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత॥21॥1॥
యవదేతా న్నిరీక్షేఽహం యోద్ధుకామా నవస్థితాన్।
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణ సముద్యమే॥22॥
యోత్సమానా నవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ర్యుద్థే ప్రియచికీర్షవః॥23॥1॥
అర్జునుడికి ఆదుర్దాగా ఉంది.పెద్ద యోథుడు కదా!అతనికి ఇవంతా కొత్త కాదు.కానీ చెప్పలేని ఏదో అలజడి.
అర్జునుడు ఒక రకంగా సమయాన్ని కొనాలనుకుంటున్నాడు.అంటే జాప్యం చేయాలని అనుకుంటున్నాడు.అందుకనే శ్రీకృష్ణుడితో ఇలా మాట్లాడు తున్నాడు.
హే యాదవా!హే కృష్ణా!మన రథాన్ని రెండు సేనల మథ్య నిలబెట్టు.దుర్యోధనుడు అసలే దుష్టబుద్ధి.అతని మాటలు నమ్మి,అతనికి సహాయంగా యుద్ధంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేదానికి సంసిద్ధత చూపించిన వీరులను చూడాలని ఉంది,దగ్గరగా!వారంతా యుద్ధం కోసం ఉవ్విళ్ళూరుతున్నట్టుగా ఉంది.
మనము ఒక ప్రణాళిక వేసుకోవాలి కదా!మనలోని ఏ ఏ వీరులు,వారి పక్షం లోని ఏ ఏ వీరులతో యుద్ధం చేయాలిఅనే విషయంగా.కాబట్టి వాళ్ళందరినీ ఒక్కసారి దగ్గరగా చూడాలని ఉంది.అది మనం రెండు సేనల మథ్యలోకి వెళితేనే కదా సాథ్యం అయ్యేది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment