Friday, 26 December 2025

నిహత్య ధార్త రాష్ట్రాన్నః

నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్స్యాజ్దనార్దన। పాపమేవాశ్రయే దస్మాన్ హత్వైతా నాతతాయినః॥36॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము అర్జునుడు తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో నిమగ్నమయి ఉన్నాడు.శ్రీకృష్ణుడిని ఉద్దేశించి చెబుతున్నాడు.కృష్ణా!జనార్దనా!వీళ్ళంతా ఏమీ పుణ్య పురుషులు కాదని నాకూ తెలుసు.నిజం చెప్పాలంటే అందరూ ఆతతాయిలే!అయినా మన బంధువులు కాబట్టి చంపదలుచుకోలేదు.ఎందుకంటావా?వాళ్ళని చంపడం వల్ల మనకు పాపాలు చుట్టుకుంటాయి తప్ప వేరే ఏ లాభం ఉండదు.ఆతతాయిలు అంటే మనకు తెలుసు కదా!అదే కృష్ణా!ఇల్లు తగలబెట్టే వాళ్ళు,విషం పెట్టేవాళ్ళు,నిరాయుధులని ఆయుధాలతో హింసించేవాళ్ళు,ధనాన్ని,భూమిని,పరాయి స్త్రీలను అపహరించే వాళ్ళు...ఇలాంటి అకృత్యాలు చేసే వాళ్ళనే కదా మనం ఆతతాయిలు అనేది.

No comments:

Post a Comment