Sunday, 7 December 2025

పాంచజన్యం హృషీకేశో

పాంచజన్యం హృషీ కేశో దేవదత్తం ధనంజయః। పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః॥15॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... శ్రీకృష్ణార్జునులు తమ తమ దివ్య శంఖాలను పూరించారు.ఆ శంఖాలకు కూడా పేర్లు ఉన్నాయి.అవి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.శ్రీకృష్ణుడు తన పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అలాగే అర్జునుడు తన దేవదత్తమనే శంఖాన్ని పూరించాడు.భీముడికి వృకోదరుడు అనే ఇంకో పేరు కూడా ఉంది.వృకోదరుడు అంటే తోడేలు లాంటి పొట్టగలవాడు అని అర్థం.తోడేలుకు ఆకలి ఎక్కువ.ఎంత తిన్నా క్షణంలో అరుగుతుంది.పొట్టకూడా పల్చగా ఉంటుంది.ఇది మంచి శక్తిని సూచిస్తుంది. భీముడు తనది అయిన పౌండ్రం అనే శంఖాన్ని భయంకరమైన శబ్దం వచ్చేలా పూరించాడు.ఆ ఘోషకు నలుదిక్కులూ వణకాల్సిందే,ఖచ్చితంగా!

No comments:

Post a Comment