Wednesday, 31 December 2025

యద్య ప్యేతే న పశ్యంతి

యద్య ప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః। కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్॥38॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడు ఇంకా తన ధోరణిని ఇలా కొనసాగిస్తున్నాడు.కృష్ణా!నేను చెప్పాను కదా!శత్రు పక్షంలో ఉండే వాళ్ళందరూ ఆతతాయిలు అని.దీనికి తోడు అందరూ దురాశాపరులు.వీళ్ళ బుద్ధి వక్రబుద్ధి.అత్యాశ పడటం తప్ప విచక్షణా జ్ఞానం లేశమయినా లేని వాళ్ళు. వాళ్ళలో ఒక్కరికి కూడా కులక్షయం వలన కలిగే పాపం అర్థం కావటం లేదు.మిత్రద్రోహం వలన చేకూరే పాతకం మనసుకు తట్టడం లేదు.ఏమి చెబుతాము వాళ్ళకి మంచి చెడ్డ!

No comments:

Post a Comment