Saturday, 13 December 2025

స ఘోషో ధార్తరాష్ట్రాణాం

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్। నభశ్చ పృథివీం చైవ తుములో ప్యనునాదయన్॥19॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము.... సంజయుడు వర్ణిస్తున్నాడు.ఆ వర్ణనకు ధృతరాష్ట్రుడికి చెమటలు పడుతున్నాయి. రాజా!చెప్పాను కదా పాండవులు,వారి తరఫు యోథులు అందరూ తమ తమ శంఖాలను దిక్కులు పిక్కటిల్లేలా పూరించారు అని.ఆ ఘోష,ఆ శబ్దం కౌరవులను,వారి సేనల గుండెలను చీలుస్తున్నట్లు ఉంది.కౌరవ పక్షం వారందరూ లోలోపల భీతి చెందారు.ఆ శబ్దం భూమ్యాకాశాలను నిండిపోయింది.అంతేనా!ప్రతిధ్వనించింది కూడా! యుద్ధంలో శత్రువుని భయపెట్టడం ఒక ప్రక్రియ.దానిలో పాండవులు ఉత్తీర్ణులు అయ్యారు.పదాతిదళాలను భయపెడితే సగం యుద్ధం గెలిచినట్లే!వాళ్ళ మనోధైర్యానికి బీటలు వారితే ఇంక మనకు తిరుగు ఉండదు.

No comments:

Post a Comment