అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్।
తథాపి త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి॥26॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.అర్జునా! బామ్మర్దీ!ముందర ముఖం పైన కనిపించే ఆ దిగులు,విచారమూ తుడిచేయి.నీకు అసలు వాటి అవసరము లేదు.
నేను ఆత్మ గురించి చెప్పే మాటలు నమ్మ బుద్ధి కావటం లేదా?అయినా పరవాలేదు.నువ్వు ఆత్మకు అంత విషయం లేదు.దానికీ చావు పుట్టుకలు ఉన్నాయి,ఉంటాయి కూడానూ అని అనుకుంటున్నావా?సరే!అట్లానే అనుకుందాము.అప్పుడు కూడా నీవు ఇంత దిగులు పడి,దుఃఖ పడి,యాగీ చేయాల్సిన అవసరము లేదు.ముందు స్థిమిత పడు.
👏🙏
ReplyDelete