Sunday, 26 April 2026

తస్మాత్త్వ మింద్రియా ణ్యాదౌ

తస్మాత్త్వ మింద్రియా ణ్యాదౌ నియమ్య భరతర్షభ। పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనమ్॥41॥3॥ శ్రీ మద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా ఘాటుగానే చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!జ్ఞానం నేర్చుకునేది దేవుడెరుగు!ముందు అజ్ఞానానికి రాచబాట వేసే కారణాలను దూరంగా పెట్టడం నేర్చుకుంటే నెత్తిన పాలు పోసినట్లు.కాబట్టి,స్వామీ!ముందర నీ ఇంద్రియాలను స్వాథీనంలో ఉంచుకుని నిగ్రహం పాటించు.కాగల కార్యం గంథర్వులే తీరుస్తారు అన్నట్లు ఈ ఇంద్రియ నిగ్రహం అనే అస్త్రం మన దగ్గర ఉంటే జ్ఞానం చాలా సులువుగా చేకూరుతుంది. కాబట్టి మిత్రమా!జ్ఞానానికి,విజ్ఞానానికి బద్ధ శత్రువు,నాశనానికి కారణం అయ్యే కామాన్ని విడిచి పెట్టు.అదే బ్రహ్మాస్త్రం కంటే శక్తివంతమయిన అస్త్రం!

1 comment: