Wednesday, 13 May 2026

యే యథా మాం ప్రపద్యంతే

యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్। మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః॥11॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము..। శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా,ఎంత చెట్టుకు అంత గాలి అని.దానినే పిండి కొద్దీ రొట్టె అని కూడా అంటుంటాము కదా!ఇక్కడ కూడా అచ్ఛం అదే పరిస్థితి.ఎవరు ఏ విథంగా,ఎంతగా నన్ను సేవిస్తారో,ఆ పరిమాణం,ఆ పద్థతిలోనే నా అనుగ్రహం కూడా ఉంటుంది.కొండంత దేవుడికి కొండంత పత్రితో పూజ చేయలేము కదా అని నీవనొచ్చు.కానీ నీ దృష్టిలో,నీ సత్తాలో నీవెంతవరకూ చేయగలతావు అనే లెఖ్ఖలు ఉంటాయి కదా!పార్థా!ఒకటి మటుకు నిజం!మానవులు అన్ని విథాలా నా మార్గాన్నే అనుసరిస్తారు,అనుసరిస్తున్నారు.ఒకరు ముందు,ఇంకొకరు తరువాత!ఒకరు కొంచెం,ఇంకొకరు ఇంకొంచెం ఎక్కువగా.అంతే!ముక్తి కావాలనుకునేవారికి ముక్తి,భుక్తి కావాలనుకునేవారికి భుక్తి చూపుతాను.భౌతికమయిన సుఖాలు కావాలంటే భోగాలు,ఆధ్యాత్మికంగా కావాలంటే కైవల్యం ప్రసాదిస్తాను.

1 comment: