Saturday, 23 May 2026

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్। బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా॥24॥4॥ శ్రీమద్భగవద్గీత..।।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా బ్రహ్మమయం అని చెబుతున్నాడు.అర్జునా!బ్రహ్మము అంటే అత్యున్నతమయిన శక్తి.దానికి ఒక శరీరం అంటూ ఏమీలేదు.ఈ సర్వజగత్తునీ కమ్ముకుని,నిర్దేశిస్తూ ఉంటుంది.దానినుంచి మనము దేనినీ విడదీయలేను.ఒకరకంగా చెప్పాలంటే అదే అద్వైతము .అది నిజము.అది శాశ్వతము.అది సృష్టికి మూలాథారం.అది లేని చోటు అంటూ ఏమీలేదు. అందుకే చెబుతున్నాను.సృక్ సువాదులు బ్రహ్మ.అంటే యజ్ఞ గుండంలో నెయ్యి వేసేదానికి వాడే గరిటలు,మిగిలిన సామానులు అని అర్థం.హోమంలో వేసేదానికి వాడే ద్రవ్యాలు బ్రహ్మ.అగ్ని బ్రహ్మ.ఆహుతి ఇచ్చేవాడు బ్రహ్మ.మనం అంత సమర్పించేదీ బ్రహ్మకే.అంటే ఇచ్చే వస్తువులు,వాడే వస్తువులు,ఇచ్చేవాడు,పుచ్చుకునేవాడు అందరూ బ్రహ్మలే!అంటే సర్వం బ్రహ్మమయం.ఈ విషయం తెలుసుకున్నవాడు బ్రహ్మత్వాన్ని పొందకుండా ఎలా ఉంటాడు చెప్పు. అంటే ఆత్మ,పరమాత్మ ఒక్కటే అనే అవగాహన అనివార్యం,అవసరం!

No comments:

Post a Comment