Monday, 25 May 2026

సర్వాణీంద్రియ కర్మాణి

సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే। ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే॥27॥4॥ శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక దానికి మించిన ఇంకొక సమర్పణ గురించి చెబుతున్నాడు.అర్జునా!కిరీటీ!ఇప్పుడు నీకు నేను కొన్ని రకాల సమర్పణల గురించి చెప్పాను కదా!ఏంది,చెప్పు?ఒకటి...ఆత్మను ఆత్మతో హోమం చేయడం.రెండవది...ఇంద్రియ నిగ్రహంలో హోమం చేయడం.మూడవది...విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేయడం. ఇంకొక వర్గం ఉంది.వాళ్ళేమి చేస్తారో,చెప్పేదా?వాళ్ళు ప్రాణ వ్యాపారాలన్నిటినీ జ్ఞాన జ్వలితమయిన ఆత్మ నిగ్రహమనే అగ్నిలో హోమం చేస్తున్నారు.ఇప్పుడు అర్థం అవుతుందా,మనము ఎక్కడ ఉన్నామో?ఆ స్థితి చేరాలంటే ఏంచేయాలో?

No comments:

Post a Comment