Friday, 8 May 2026

యదా యదా హి ధర్మస్య

యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత। అభ్యుత్థాన మధర్మస్య తదాఽఽత్మానం సృజామ్యహమ్॥7॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడికి నమ్మకం కుదిరింది అర్జునుడి పైన.తను చెప్పేది అర్థం చేసుకోగలడని,తన మాటలు నమ్ముతున్నాడని.అందుకని చిన్న చిన్నగా లోతుగా చెబుతున్నాడు.అర్జునా!మిత్రమా!నాకు నేనే సృష్టించుకుని,జన్మలు ఎత్తుతూ ఉంటాను అని ఇప్పుడే చెప్పాను కదా!ఎందుకనుకుంటున్నావు?ఓ భరత శ్రేష్ఠా!అధర్మం పెరిగిన ప్రతిసారీ ధర్మం కుంటుపడుతుంది.కృంగిపోతుంది.కృంగిపోయిన ధర్మాన్ని పైకి లేపి,నిలబెట్టాలి కదా!అది ఆషామాషీ వ్యవహారం కాదు కదా!అధర్మం పెచ్చుమీరి,పేట్రేగి పోయే తరుణం వచ్చినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటాను.ఇదంతా లోక కళ్యాణం కోసం చేస్తుంటాను.ఎందుకంటే మంచి ఎప్పుడూ మసిబారకూడదు.అధర్మాన్ని పెంచి పోషించేవారిని అణగద్రొక్కాలి.

No comments:

Post a Comment