Saturday, 9 May 2026

పరిత్రాణాయ సాథూనాం

పరిత్రాణాయ సాథూనాం వినాశాయ చ దుష్కృతామ్। ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥8॥4॥ శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!మామూలుగా ఇంటి పెద్ద ఎలాగుంటాడు?ఇంట్లో వాళ్ళందరికీ తలలో నాలుక లాగుంటాడు.అందరికీ మంచిగా ఉండమని చెబుతుంటాడు.ఎవరైనా తోక ఆడిస్తున్నట్లు తెలిస్తే ముందర భయం పెడతాడు.అయినా వినకపోతే తాట తీసి,ఉతికి ఆరేస్తాడు.నేనూ అంతే!ఈ సృష్టికి మొత్తం నేనే తల్లినీ,తండ్రినీ,గురువునీ!మరి నేను ఇంకెలా ఉండాలో చెప్పు?మంచి వాళ్ళను రక్షిస్తూ ఉంటాను.దుష్టులను శిక్షిస్తూ ఉంటాను.ధర్మ సంస్థాపన నా ధ్యేయము.దానికి ఎవరు అడ్డు వచ్చినా క్షమించను.తాత్సారము చేయను.కాబట్టి ఈ బృహత్ కార్యక్రమాల కోసరము ప్రతి యుగములోనూ నేను అవతరిస్తూనే ఉంటాను.

No comments:

Post a Comment