Friday, 15 May 2026

న మాం కర్మాణి లిమ్పన్తి

న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మ ఫలే స్పృహా। ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే॥14॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!మనంచేసే ప్రతి పనికీ ఏదో ఒక ఫలం,ఫలితమూ ఉంటాయి.ఇది జగమెరిగిన సత్యము.కానీ నాకు కర్మఫలం మీద ఆశ,ఆసక్తీ లేవు.కాబట్టి నేను ఆచరించే కర్మల ఫలం నాకు ఏ మాత్రమూ అంటదు.నా ఈ తత్త్వాన్ని ఎరిగిన వాళ్ళకు కూడా కర్మలు బంథించలేవు.ఎందుకంటే నన్ను నమ్మే వాళ్ళు నా బాటలో నడుస్తారు.నేను కర్మఫలానికి ఆమడ దూరంలో ఉంటాను అంటే వాళ్ళు కూడా అలానే ఉంటారు.

No comments:

Post a Comment