Friday, 22 May 2026

యదృచ్ఛా లాభ సంతుష్టో

యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః। సమ సిద్థావ సిద్థౌచ కృత్వాపి న నిబధ్యతే॥22॥4॥ శ్రీమద్భగవగ్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మనము ఎలా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!ఇందాకటి నుంచి నేను నీకు మనిషి ఎలా ఉండాలో చెబుతున్నాను.అదే ఇంకొంచెం వివరంగా చెబుతాను.మనము మనకున్న దానితో తృప్తి పడడం నేర్చుకోవాలి.ప్రతి దానికీ అసంతృప్తి,అనుమానం,అసహనం ఉండకుండా ఉండాలి.మనము అసూయ,ఈర్ష్య,పగ,ప్రతీకారాలను మరిచిపోవాలి.మనసులో కూడా మననం చేసుకోకూడదు.ఎందుకంటే ఈ మాత్సర్యంకి మూల కారణం అసంతృప్తి.మనకేదో అన్యాయం జరుగుతుందేమో అనే అనుమానం.మనకంటే ఎదుటివాడు మనకంటే ఎక్కువ సత్తా లేక పోయినా,మనకంటే బాగా వృద్ధిలోకి వస్తున్నాడేమో అనే శంక.వాడిని ఎలాగైనా పడగొట్టాలి,మనమే ముందుకు పోవాలి అనే పగ,ప్రతీకార్య చర్యలు,ఆబ,అత్యాశ.వీటన్నిటినీ తుడిచి పెట్టేయాలి.మనము మనము చేపట్టిన కార్యము,కర్మ సిద్ధించినా,సిద్ధించకపోయినా మనసు సమతుల్యంగా ఉండేలా సాథన చెయ్యాలి. అంటే,తనకు లభించిన దానితో తృప్తి పడేవాడు,శంకారహితుడు,మాత్సర్యం లేనివాడు,కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి కలవాడు...ఏ కర్మలు చేసినా బంధాలు అనే చట్రంలో చిక్కుకోడు.తామరాకు మీద నీటి బొట్టు చందాన వెలిగిపోతుంటాడు.

No comments:

Post a Comment