Monday, 11 May 2026

వీతరాగ భయక్రోథాః

వీతరాగ భయక్రోథాః మన్మయా మా ముపాశ్రితాః। బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః॥10॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మెల్లగా,వివరంగా చెబుతున్నాడు.అర్జునా!కిరీటీ!ఇందాకే చెప్పాను కదా ముక్తి పొందాలంటే నన్ను గుర్తించాలి,నన్ను నమ్మాలి,నన్ను ఆశ్రయించాలి అని.ముందర రాగ ద్వేషాలను,మద మాత్సర్యాలను,క్రోథ భయాలను విడిచి పెట్టాలి.మనం అన్నం తినాలంటే అట్లనే చేతులు పెట్టి,తినము కదా!ముందర కాళ్ళూ,చేతులు కడుక్కుంటాము.శుభ్రమయిన ప్రదేశంలో కూర్చుంటాము.తినే అన్నము,సాదకాలు గరిటెలతో పెట్టుకుంటాము.వెనక తినేవాళ్ళుంచారు కదా!కాబట్టి చేతులు పెట్టి వేసుకోము.ఇక్కడ కూడా అంతే.మనిషి తనకు తాను మానసికంగా తయారు కావాలి.తరువాత నన్ను ఆశ్రయించాలి.నన్నే ధ్యానించాలి.అప్పుడు అతను తపఃపునీతుడు అయి నన్ను,నా భావాన్నీ పొందుతాడు.ఏదీ సులభంగా దొరకదు.నిష్ట,నియమాలు పాటిస్తేనే దక్కేది.

No comments:

Post a Comment