Tuesday, 19 May 2026

కర్మణ్య కర్మ యః పశ్యేత్

కర్మణ్య కర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః। స బుద్థిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్॥18॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి సారం బోథిస్తున్నాడు.అర్జునా!పార్థా!ఈ ప్రకృతి ఎలా చూస్తే అలా కనిపిస్తుంది.ఎలా చూడాలో అనేది మనము తెలుసుకోవాలి.నేను చెప్పే కర్మ,అకర్మ,వికర్మలను అన్నిటినీ ఒకేసారి కూలంకషంగా అధ్యయనం చేస్తే ఒక విషయం బయట పడుతుంది.ఎవడైతే కర్మలలో అకర్మలను చూస్తాడో,అకర్మలలో కర్మలను చూస్తాడో వాడే బుద్ధిమంతుడు.వాడు సర్వ కర్మలనూ ఆచరించినట్లు లెఖ్ఖ.శూన్యంలోనుంచి పుట్టింది మళ్ళీ శూన్యంలోకి చేరుతుంది.అంత మాత్రానికి ఇదంతా తెలుసుకోవడం ఎందుకు అనుకుంటున్నావా?కొలిమిలో కాల్చి సమ్మెటతో కొడితేగానీ ఇనుము సాగదు.బంగారం సుందరమయిన ఆభూషణం కాదు.మన ఆత్మలో మథనం మొదలుకావాలి.అంతా మాయ అని తెలుసుకునేదానికి ముందర అన్నిటిలో నుంచీ ప్రయాణం కొనసాగించాలి కదా!

No comments:

Post a Comment