Sunday, 24 May 2026

దైవమే వాపరే యజ్ఞం

దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే। బ్రహ్మగ్నా వపరే యజ్ఞం యజ్ఞేనై వోపజుహ్వతి॥25॥4॥ శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి సమర్పణ గురించి చెబుతున్నాడు.అర్జునా!మనలో కొంత మంది దేవతలను తృప్తి పరిచేదానికి యజ్ఞాలు చేస్తారు.సామాన్యంగా అలాంటివి అన్నీ ఆయా దేవతలను సంతృప్తి పరచి,వాళ్ళ ద్వారా లాభం పొందాలనుకునే ప్రక్రియలు.కానీ అసలు సిసలు సమర్పణ అంటే ఏందో చెబుతాను,విను.ఇందాక నేను చెప్పాను కదా ఈ సృష్ఠి అంతా బ్రహ్మమయము అని.ఆ బ్రహ్మైక భావనతో కొందరు ఉంటారు.వారికి యజ్ఞశాలలు అఖ్ఖరలేదు.యజ్ఞ గుండాలు,సామగ్రి అఖ్ఖరలేదు.మంత్ర పఠనానికి తోడు ఋత్విక్కులు అక్కరలేదు.వారు నిత్యము,సత్యము అయిన సర్వవ్యాపకుడిని బ్రహ్మైక భావంతో ఆత్మను ఆత్మయందే హవిస్సులాగ ఉపయోగించి హోమం చేసి,ఆత్మార్పణం చేసుకుంటారు. అసలు అక్కడ నువ్వే నేను,నేనే నువ్వు అనే భావన.నేనే నేను కానప్పుడు నువ్వు నేను ఎలా అవుతాను?అంటే అంతా మిథ్యే కదా!అంటే నీ,నా అంటూ ఏమీ లేదు.అంతా శూన్యమే!అంతా ఫలభరితమే!అంతా కలిసిపోయింది.దేనినుంచీ దేనినీ విడదీయలేము.

No comments:

Post a Comment