Saturday, 16 May 2026

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః। కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్॥15॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!కర్మఫలం ఆశించకుండా కర్మలు చేయాలి అని ముముక్షువులు కూడా తెలుసుకున్నారు.వారందరూ కూడా నిష్కామంగా కర్మలను ఆచరించారు.పూర్వీకులు కదా మనకు మంచి మార్గం చూపించేది.కాబట్టి నీవు కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకో!నీవు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా,కర్మలను ఆచరించు.మనం చేసే ఒక మంచి పని వల్ల పది మందికి మంచి జరుగుతుంది అంటే అంతకంటే మనకు ఇంకేమి కావాలి.అంటే లోక కళ్యాణం మన పరమావథి కావాలి.నీ సొంత లాభం,నా సొంత లాభం చూడకూడదు.

No comments:

Post a Comment